newsreviews9 newsreviews9 Author
Title: గోపి చంద్ అక్షిజెన్ సినిమ ఫస్ట్ లుక్ పోస్టర్
Author: newsreviews9
Rating 5 of 5 Des:
గో పీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్‌’. రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయెల్‌ కథానాయికలు. జగపతిబాబు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఎ.ఎం....



గోపీచంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్‌’. రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయెల్‌ కథానాయికలు. జగపతిబాబు ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌.ఐశ్వర్య నిర్మాత. గురువారం తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఒక విభిన్నమైన కథతో యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న చిత్రమిది. గోపీచంద్‌ని తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చిత్రంలోని ప్రతి సన్నివేశం ఆసక్తి రేకెత్తిస్తుంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. వీలైనంత త్వరగా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ’’న్నారు. కిక్‌ శ్యామ్‌, అలీ, బ్రహ్మాజీ, సితార, అభిమన్యుసింగ్‌, సాయాజీ షిండే, చంద్రమోహన్‌, సుధ, ప్రభాకర్‌ తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా

About Author

Advertisement

Post a Comment

 
Top