newsreviews9 newsreviews9 Author
Title: బాలకృష్ణ తల్లి పాత్రలో హేమ మాలిని
Author: newsreviews9
Rating 5 of 5 Des:
నందమూరి బాలకృష్ణ వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో బాలీవుడ్‌ నటి హేమ మాలిని నటించనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. క్రిష్‌ దర్...

నందమూరి బాలకృష్ణ వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో బాలీవుడ్‌ నటి హేమ మాలిని నటించనున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ తల్లి పాత్రలో హేమ మాలిని కనిపించనున్నారని టాక్‌. ఇటీవల ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు, నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక, లొకేషన్ల వేటతో బిజీగా ఉన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కే చిత్రమిది. 2000 సంవత్సరాల కిందట కథ ఇది. అందుకే తగిన లొకేషన్లను అన్వేషించడానికి క్రిష్‌ బృందం యూరప్‌ పయనమైంది. ఈలోగా నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలెట్టేశారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తారు. 1971లో వచ్చిన ‘శ్రీకృష్ణ విజయం’లో ‘జోహారు శిఖిపించ మౌళి..’ అనే పాటలో కనిపించారు హేమ మాలిని. ఆ తరువాత తెలుగులో నటించనే లేదు. ఇప్పుడు 45ఏళ్ల తర్వాత ఆమె తెలుగులో నటించనున్నారన్నమాట. అయితే ఇదే పాత్ర కోసం శోభన పేరు కూడా పరిశీలనలో ఉంది.

About Author

Advertisement

Post a Comment

 
Top