newsreviews9 newsreviews9 Author
Title: రెజీనా కొత్త నిర్ణయం
Author: newsreviews9
Rating 5 of 5 Des:
  నటి రెజీనా కెరీర్‌కు కొంత గ్యాప్ ఏర్పడడంతో ఆమె కొత్త నిర్ణయం తీసుకున్నారు. కేడి బిల్లా కిల్లాడి రంగా, నిర్ణయం, రాజతంత్రం అంటూ తమిళంలో కొ...
 
నటి రెజీనా కెరీర్‌కు కొంత గ్యాప్ ఏర్పడడంతో ఆమె కొత్త నిర్ణయం తీసుకున్నారు. కేడి బిల్లా కిల్లాడి రంగా, నిర్ణయం, రాజతంత్రం అంటూ తమిళంలో కొన్ని చిత్రాలలో మాత్రమే నటించిన రెజీనా తెలుగులోనూ తక్కువ చిత్రాలలోనే నటించారు. ప్రముఖ హీరోయిన్‌గా తాను రాణించాలనే ఆసక్తి రెజీనాకు అధికంగానే ఉంది. ఆమె నటనకు ప్రశంసలు అందాయి. అయితే తనకు తగిన పాత్రలు ఎంపిక చేయకపోవడం, ఫెయిల్యూర్ చిత్రాలలో నటించడం ఆమె పురోగతికి అడ్డుగా నిలిచింది. షూటింగ్‌కు వచ్చినా ఎవరితోను మాట్లాడకుండా దూరంగా కూర్చునేవారు.

దీంతో సహ నటీనటులు ఆమెతో సహజంగా మెలిగేందుకు సంశయించేవారు. ఇతరులతో సన్నిహితంగా ఉంటే తిప్పలు తప్పవని భావించిన రెజీనాకు అదే తంటాగా మారింది. ఇలా వెనక్కి తిరిగి చూస్తే చిత్రరంగంలో చాలా ఏళ్లు గడిచిపోయాయి. పాత పొరపాట్లను తలచుకుని మనస్తాపానికి గురైన రెజీనా ప్రస్తుతం ఇతరులతో సన్నిహితంగా మెలుగుతున్నా స్నేహం అని చెప్పుకునేందుకు పెద్దగా లేరు. దీంతో ప్రత్యామ్నాయ మార్గంలో అవకాశాలను అందుకునేందుకు గ్లామరస్‌గా నటించేందుకు సిద్ధమని ప్రకటించారు.

About Author

Advertisement

Post a Comment

 
Top